Breaking News

ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్న మంత్రి

నిజామాబాద్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద జార్ఖండ్‌కు చెందిన వల‌స కూలీల‌తో వెళ్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం బోల్తాపడిన ఘటనపై మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి స్పందించారు. ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతా రెడ్డితో ప్రమాద ఘటనపై ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మేడ్చల్‌ జిల్లాలోని ఓ నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న వీరు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో తమ స్వస్థలాల‌కు టాటా మ్యాజిక్‌ ప్రైవేట్‌ వాహనంలో బయలుదేరారు. కామారెడ్డి జిల్లా దగ్గి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న జిల్లా ఎస్పీ క్షతగాత్రులు ఆరుగురుని జిల్లా ఆసుపత్రికి, 12 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద స్థలిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఘటన పట్ల మంత్రి వేముల‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కూలీలు పనిచేస్తున్న సంబంధించిన‌ కంపెనీకి సమాచారం అందించగా వారు ఆసుపత్రికి చేరుకున్నారు.

The following two tabs change content below.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article