Breaking News

లాక్‌ డౌన్‌ అతిక్రమించిన వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 129 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 94, ఆటోలు 32, ఫోర్ వీల‌ర్స్‌ 3 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాల‌ని పేర్కొన్నారు. రాత్రి 7 గంటల‌ నుంచి ఉదయం 6 గంటల‌ వరకు ప్రజలెవ్వరు బయటకు రాకూడదన్నారు. అత్యవసర మెడికల్‌ అవసరాల‌ కోసం పోలీసుశాఖ తరఫున పాస్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

పాస్‌లు సంబంధిత డివిజనల్‌ ఏసిపి నుండి పొందాల‌న్నారు. నిజామాబాద్‌ డివిజన్‌ ఏసిపి ఫోన్‌ నెం. 94407 95405, ఆర్మూర్‌ డివిజన్‌ ఏసిపి 94407 95404, బోధన్‌ డివిజన్‌ ఏసిపి 94407 95406. ఎలాంటి సమాచారం కోసమైనా డయల్‌ 100, స్పెషల్‌ బ్రాంచ్‌ నెంబర్‌ 94906 18000, పోలీసు కంట్రోల్‌ రూం 08462 226090 నెంబర్లలో సంప్రదించాల‌న్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *