Breaking News

శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు

ఎల్లారెడ్డి, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ కార్యాల‌యంలో గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే, మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి వైద్య సిబ్బందిచే మున్సిపల్‌ శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్‌ వ్యాధి పరీక్షలు చేశారు. అదేవిధంగా శానిటేషన్‌ వర్కర్లకు మందులు పంపిణి చేశారు.

అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ శానిటేషన్‌ వర్కర్లకి కరోనాపై అవగాహనా కల్పించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు బుంగారి రాము, జంగం నీల‌ కంఠం, నాయకులు రాజు, వైద్య సిబ్బంది డాక్టర్‌ వెంకట స్వామి, డాక్టర్‌ సంజయ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మధు సూధన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎల్లారెడ్డిలో దుకాణాలు తెరిచి ఉంచే సమయమిదే…

ఎల్లారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న ...

Comment on the article