Breaking News

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు చేసుకుని సిద్ధంగా ఉండాల‌ని సంబంధిత అధికారుల‌కు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సూచించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌, ఇరిగేషన్‌ అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సాగుకు అనువైన భూమి ఎంత ఉంది, గత సంవత్సరం ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, నీటి ల‌భ్యత ఎంత ఉంది, ప్రాజెక్టు క్రింద నీటి ల‌భ్యత, ప్రాజెక్టు వారీగా ఆయకట్టు వివరాలు, గత ఖరీఫ్‌లో జిల్లాలో పండిన పంట వివరాలు, ప్రతిపంటకు సంబంధించిన రకాల‌ వివరాలు, లాభనష్టాల‌ వివరాలు, రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ వివరాలు కూలంకషంగా తయారుచేసి సిద్ధంగా ఉంచాల‌న్నారు.

శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వ్యవసాయంపై అన్ని జిల్లాల‌ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని, అందులో మన జిల్లాకు సంబంధించిన ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ వివరించాల‌ని, అందుకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాల‌న్నారు. రాష్ట్రంలో కొన్ని రకాల‌ పంటలు అవసరానికి మించి పండుతున్నాయని, ఉదాహరణకు గత సంవత్సరం తాలూకు వరి, మొక్కజొన్న ధాన్యాలు ఎఫ్‌సిఐ గోదాముల‌లో ఇప్పటికీ నిలువ ఉన్నాయని, రైతు డిమాండ్‌ ఉన్న పంటలు పండిరచినట్లైతే గిట్టుబాటు అవుతుందని, అందుకు తగ్గట్టుగా రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి భౌగోళిక పరిస్థితుల‌ను బట్టి ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలో ప్రభుత్వమే నిర్ణయించి రైతుకు అన్ని విధాలా చేయూత నివ్వడానికి చర్యలు తీసుకుంటుందని, కనుక జిల్లాకు సంబంధించిన పక్కా ప్రణాళికను రూపొందించి సిద్ధంగా ఉండాల‌న్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, జిల్లా ఉద్యానవన శాఖాధికారి నర్సింగ్‌ దాస్‌, జిల్లా సహకార శాఖాధికారి సింహాచలం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *