Daily Archives: May 15, 2020

మైత్రి మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి ప్రారంభం

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ విప్‌, శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌ చేతుల‌మీదుగా మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని గోదాం రోడ్‌లో ప్రారంభించారు. రోగుల‌కు సేవా దృక్పధంతో వైద్యం అందించాల‌ని, వ్యాపార కోణంలో కాకుండా చూడాల‌ని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, వైస్‌ చైర్‌ పర్సన్‌ మధుప్రియ. సీనియర్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌ రావు, ముజీబ్‌ ఉద్దీన్‌, నిట్టు కృష్ణ మోహన్‌, పిప్పిరి సుష్మ వెంకటి, జైపాల్‌ రెడ్డి, పున్న రాజేశ్వర్‌, ...

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాల‌ని ఏవోకు వినతి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌డివో కార్యాల‌యం వద్ద కార్మిక హక్కులు హరించివేతను నిరసిస్తూ ఏఐసిటియు జిల్లా కార్యదర్శి జిల్లా బాధ్యుడు రాజలింగం అధ్వర్యంలో నిరసన తెలిపి ఏఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కరోన కట్టడికి కొనసాగిస్తున్న లాక్‌ డౌన్ అమలు పరుస్తున్న పాల‌కులు ఉపాధి లేక అవస్థలు పడుతున్న అసంఘటిత, సంఘటిత రంగాల‌ కార్మికులైన నిర్మాణ రంగం కార్మికులు, షాప్‌ ఎంప్లాయిస్‌ కార్మికులు, మున్సిపల్‌, ఆటో కార్మికులు, హమాలి, ...

Read More »

వల‌స కార్మికుల‌కు బిజెపి అన్నదానం

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ తరువున కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో వల‌స కార్మికుల‌ కోసం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సుమారు 650 మందికి ఉదయం 11 గంటల‌ నుండి మధ్యాహ్నం 3 గంటల‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని వల‌స కార్మికులు వాళ్ళ సొంత రాష్టాల‌కు పోయే వారి ఆకలి తీర్చాల‌ని బీజేపీ ...

Read More »

మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి ముద్రవేయాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిడే ప్రతి వారంలో రెండు రోజుల‌పాటు నిర్వహించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. బిచ్కుంద ఎంపీడీవో కార్యాల‌యంలో శుక్రవారం అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ప్రతి గురు, శనివారం రోజున అంగన్‌వాడి కేంద్రాల‌కు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు కేంద్రాల‌కు వెళ్లి నమోదైన గర్భవతుల‌ సంఖ్యను పరిశీలించాల‌ని సూచించారు. పని అడిగిన ప్రతి కూలికి పని కల్పించవల‌సిన బాధ్యత అధికారుల‌పై ఉందన్నారు. నీటి సంరక్షణ పనులు ఉపాధి హామీలో చేపట్టాల‌ని సూచించారు. బిచ్కుంద ...

Read More »

వంద పడకల‌ ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల‌ సంఖ్య పెంచాల‌ని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌కు సూచించారు. శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్‌ సందర్శించి ఏర్పాట్లు వసతుల‌పై వైద్యుల‌తో సమీక్షించారు. చిన్నారుల‌కు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయాల‌ని, ప్రతి సోమవారం ఆరోగ్య కేంద్రాలు గర్భిణీల‌కు వైద్య పరీక్షలు చేయాల‌ని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న వంద పడకల‌ ఆసుపత్రిని పరిశీలించి, పనులు త్వరితగతిన ...

Read More »

ప్రభుత్వాలు ప్రజల‌కు ధైర్యం చెప్పాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండల‌ కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆటోడ్రైవర్లకు, వృద్ధుల‌కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడని, కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీ నీళ్లు ఆంధ్రకు వెళ్తే సంగారెడ్డి, ...

Read More »

గర్భిణీలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి

నందిపేట్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలం కోమటిపాలీ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి పోషక ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గర్భిణీల‌కు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల‌ని, అత్యవసరంగా బయటకు వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని ఎంపిటిసి రాణి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు నాగరాజు, ...

Read More »

శిశుమందిర్‌ పూర్వవిద్యార్థి సేవాదృక్పథం

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ కామారెడ్డి పూర్వ విద్యార్థి కుప్రియాల్‌ గ్రామానికి చెందిన విక్రమాదిత్యరెడ్డి (10వ తరగతి) కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించిన నాటి నుండి ప్రతి రోజు రెండు పూటలు మాత్రమే భోజనం చేస్తూ మిగిలిన ఒకపూటకు సరిపోయే బియ్యం మిగిలించాడు. కాగా మిగిలిన బియ్యాన్ని సేవాభారతి కామారెడ్డి విభాగానికి అందజేసి తన సేవా గుణాన్ని చిన్నతనంలోనే చాటుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌ డౌన్‌ మొదటి ఉపన్యాసంలో ...

Read More »

డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయింపు సిగ్గుచేటు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల‌ జడ్పిటిసి ఎర్ర యమునా ముత్యం గురువారం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి అన్నారు. వార్డ్‌ మెంబర్‌గా కూడా గెల‌వలేని యమునా ముత్యంకు బిజెపి పార్టీ నుంచి జడ్పిటిసి టికెట్‌ ఇచ్చి, పార్టీ కార్యకర్తలంతా అహర్నిశలు ఆయన వెంట ఉండి గెలిపించారని గుర్తుచేశారు. కానీ అవేవి లెక్కచేయకుండా జడ్పిటిసి ఇలా డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయించడం సిగ్గుచేటని, ఇలాంటి ...

Read More »