Breaking News

వల‌స కార్మికుల‌కు బిజెపి అన్నదానం

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ తరువున కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో వల‌స కార్మికుల‌ కోసం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సుమారు 650 మందికి ఉదయం 11 గంటల‌ నుండి మధ్యాహ్నం 3 గంటల‌ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని వల‌స కార్మికులు వాళ్ళ సొంత రాష్టాల‌కు పోయే వారి ఆకలి తీర్చాల‌ని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందని, అందులో భాగంగా కామారెడ్డిలో టెక్రియల్‌ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, వల‌స కార్మికులు క్షేమంగా వాళ్ళ స్వస్థలాల‌కి చేరుకోవాల‌ని కోరుకుంటున్నామని అన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article