Breaking News

ప్రభుత్వాలు ప్రజల‌కు ధైర్యం చెప్పాలి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండల‌ కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆటోడ్రైవర్లకు, వృద్ధుల‌కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడని, కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీ నీళ్లు ఆంధ్రకు వెళ్తే సంగారెడ్డి, మహబూబ్‌న‌గర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని, పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు మూడు టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలిస్తామని, ఆంధ్రాలో చేసిన జీవో సీఎం కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో అడ్డుకుంటామన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రాకు తరలించనున్న నీటిని అడ్డుకోవాల‌ని, లేకుంటే సీఎం కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్‌ చేశారు.

నీటిని అడ్డుకునేందుకు గతంలో కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేసిందని, మరోసారి కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అసలు దేశంలో ఏం జరుగుతుంది… కరోనా మహమ్మారి నుండి ప్రజల‌ను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయని, ప్రజలు భయం భయంతో బతుకుతున్నారని, వారికి ఎలా ధైర్యం చెప్పానుకుంటుందని షబ్బీర్‌ అన్నారు.

దేశ ప్రజల‌ను కాపాడే మార్గంపై భారతీయ శాస్త్రవేత్తల‌తో ఈనాటికి సంప్రదింపులు జరిపిన దాఖలాలు గాని సమాచారం గాని లేదన్నారు. శాస్త్రవేత్తల‌తో ఒక్క సమావేశం నిర్వహించలేదని, కేవలం ముఖ్యమంత్రుల‌తో సమావేశాలు జరుపుతూ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రులేమో ఇప్పటి వరకు బుడ్డపైసా రాలేదంటున్నారని, ఎవరు అబద్ధం చెపుతున్నారో, ఎవరు నిజాలు చెబుతున్నారో ప్రజల‌కు అర్థంకాని అయోమయ స్థితి నెల‌కొందన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article