Breaking News

వంద పడకల‌ ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల‌ సంఖ్య పెంచాల‌ని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌కు సూచించారు. శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్‌ సందర్శించి ఏర్పాట్లు వసతుల‌పై వైద్యుల‌తో సమీక్షించారు. చిన్నారుల‌కు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయాల‌ని, ప్రతి సోమవారం ఆరోగ్య కేంద్రాలు గర్భిణీల‌కు వైద్య పరీక్షలు చేయాల‌ని పేర్కొన్నారు.

నిర్మాణంలో ఉన్న వంద పడకల‌ ఆసుపత్రిని పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాల‌ని కోరారు. ఉపాధి హామీ పనుల‌కు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాల‌ని అన్నారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాల‌యంలో మండల‌ స్థాయి అధికారుల‌తో సమీక్షించి, కూలీల‌ సంఖ్య పెంచకపోతే గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో, ఏపీవో, ఏపీవోపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాన్సువాడ మండలంలో పదివేల‌ మంది కూలీలు పని చేసే విధంగా చూడాల‌ని, పట్టణ ప్రగతి పనుల‌పై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. బిచ్కుంద మండలం పుల్క‌ల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ తనిఖీ చేసి, కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు ధాన్యం తేగానే ఏఈఓలు అనుమతి పత్రాలు ఇవ్వాల‌ని సూచించారు. తేమ శాతం వచ్చిన రైతుల‌ ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని కోరారు.

లారీలు సక్రమంగా రావడం లేదని రైతులు కలెక్టర్‌ దృష్టికి తేగా, వెంటనే సమస్యను పరిష్కరించాల‌ని అధికారుల‌కు సూచించారు. బాన్సువాడ ఆర్డివో రాజేశ్వర్‌, ఏపీవో సుదర్శన్‌, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ మోహన్‌ బాబు, వైద్యాధికారులు శ్రీనివాస్‌ ప్రసాద్‌, మమత, మహాల‌క్ష్మి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article