Breaking News

గర్భిణీలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి

నందిపేట్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలం కోమటిపాలీ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి పోషక ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గర్భిణీల‌కు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల‌ని, అత్యవసరంగా బయటకు వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని ఎంపిటిసి రాణి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు నాగరాజు, జిల్లా విద్య, క్రీడల‌ కార్యదర్శి మద్దుల‌ మురళీ, అంగన్వాడీ టీచర్లు పద్మ, మహిళలు పాల్గొన్నారు.

Check Also

బాధిత కుటుంబానికి సరుకులు పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం తొండాకుర్‌ గ్రామంలో ఐకెపి ...

Comment on the article