Breaking News

శిశుమందిర్‌ పూర్వవిద్యార్థి సేవాదృక్పథం

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ కామారెడ్డి పూర్వ విద్యార్థి కుప్రియాల్‌ గ్రామానికి చెందిన విక్రమాదిత్యరెడ్డి (10వ తరగతి) కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించిన నాటి నుండి ప్రతి రోజు రెండు పూటలు మాత్రమే భోజనం చేస్తూ మిగిలిన ఒకపూటకు సరిపోయే బియ్యం మిగిలించాడు. కాగా మిగిలిన బియ్యాన్ని సేవాభారతి కామారెడ్డి విభాగానికి అందజేసి తన సేవా గుణాన్ని చిన్నతనంలోనే చాటుకున్నాడు.

ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌ డౌన్‌ మొదటి ఉపన్యాసంలో పేద ప్రజల‌ ఆకలిని తీర్చడం కోసం ఉన్నంతలో సేవచేయాల‌నే మాటలు తనను ప్రభావితం చేసాయని, ఒక్కపూట బియ్యం ఏ కొంతమందికైనా ఆకలి తీర్చకపోతాయా… అనిపించి దాచానని విక్రమాదిత్యరెడ్డి పేర్కొన్నాడు.

శిశుమందిర్‌లో చదివిన సదాచారం, సంస్కారమే తనచే ఈ పని చేయిస్తుందని తెల‌పడం విశేషం. ఈరోజు విక్రమాదిత్య చేసిన ఈ చిన్న పని ఎంతో మందికి ప్రేరణనిచ్చింది. మీ వంతుగా మీరు విక్రమాదిత్యను అభినందిస్తూ మీ చిన్నారుల‌ను కూడా ఆ దిశగా ప్రోత్సాహించండి.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article