Breaking News

కార్మికుల సమస్యలు పరిష్కరించాల‌ని ఏవోకు వినతి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌డివో కార్యాల‌యం వద్ద కార్మిక హక్కులు హరించివేతను నిరసిస్తూ ఏఐసిటియు జిల్లా కార్యదర్శి జిల్లా బాధ్యుడు రాజలింగం అధ్వర్యంలో నిరసన తెలిపి ఏఒకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కరోన కట్టడికి కొనసాగిస్తున్న లాక్‌ డౌన్ అమలు పరుస్తున్న పాల‌కులు ఉపాధి లేక అవస్థలు పడుతున్న అసంఘటిత, సంఘటిత రంగాల‌ కార్మికులైన నిర్మాణ రంగం కార్మికులు, షాప్‌ ఎంప్లాయిస్‌ కార్మికులు, మున్సిపల్‌, ఆటో కార్మికులు, హమాలి, ఇండ్లలో పనిచేసే పాచిపని కార్మికులు గత మూడు నెల‌లుగా ఉపాధికరువై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిరదన్నారు. కార్మికుల‌కు కరోన విపత్తు సహాయం అందించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 ల‌క్షల‌ కోట్లు పెట్టుబడి దార్లకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు చెయ్యడమే కాకుండా ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల‌లో కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మిక హక్కులు హరించే విధానాన్ని ఏఐసిటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.

తక్షణమే ఆ రాష్ట్రాలు కార్మిక చట్టాలు, 8 గంటల‌ పనికై నిర్మాణ కార్మికులు 200 కోట్లు తిరిగి నిర్మాణ కార్మికుల‌కు కేటాయించాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు మద్దెల‌రాజు, బట్టల‌షాప్‌ కార్మిక సంఘం నాయకులు దేవేందర్‌, నిర్మాణసంఘం నాయకులు తిరుపతి, సిద్దయ్య, ప్రవీణ్‌, స్వామి, పరశురాము తదితరులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article