Breaking News

మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి ముద్రవేయాలి

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిడే ప్రతి వారంలో రెండు రోజుల‌పాటు నిర్వహించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. బిచ్కుంద ఎంపీడీవో కార్యాల‌యంలో శుక్రవారం అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ప్రతి గురు, శనివారం రోజున అంగన్‌వాడి కేంద్రాల‌కు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు కేంద్రాల‌కు వెళ్లి నమోదైన గర్భవతుల‌ సంఖ్యను పరిశీలించాల‌ని సూచించారు.

పని అడిగిన ప్రతి కూలికి పని కల్పించవల‌సిన బాధ్యత అధికారుల‌పై ఉందన్నారు. నీటి సంరక్షణ పనులు ఉపాధి హామీలో చేపట్టాల‌ని సూచించారు. బిచ్కుంద ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. బిచ్కుంద మండలంలో 14వేల‌ 136 జాబ్‌ కార్డులు ఉన్నాయని తెలిపారు. శ్రమశక్తి సంఘాల‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవసరమైన పనుల‌ను గుర్తించి చేపట్టాల‌ని కోరారు. అనంతరం మహారాష్ట్ర సరిహద్దులోని మదునూర్‌ చెక్‌ పోస్ట్‌ను పరిశీలించారు.

మహారాష్ట్ర నుంచి మన జిల్లా లోకి వచ్చిన వారికి ముద్రలు వేయాల‌ని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డివో రాజేశ్వర్‌, తహసిల్దార్‌ క్రిస్టి నాయక్‌, ఎంపీడీవో సాయిశ్రీ, అధికారులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article