Breaking News

డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయింపు సిగ్గుచేటు

ఆర్మూర్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల‌ జడ్పిటిసి ఎర్ర యమునా ముత్యం గురువారం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి అన్నారు. వార్డ్‌ మెంబర్‌గా కూడా గెల‌వలేని యమునా ముత్యంకు బిజెపి పార్టీ నుంచి జడ్పిటిసి టికెట్‌ ఇచ్చి, పార్టీ కార్యకర్తలంతా అహర్నిశలు ఆయన వెంట ఉండి గెలిపించారని గుర్తుచేశారు.

కానీ అవేవి లెక్కచేయకుండా జడ్పిటిసి ఇలా డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయించడం సిగ్గుచేటని, ఇలాంటి వాళ్లను నమ్మి ఓట్లు వేసిన ప్రజల‌కు నమ్మకద్రోహం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రజలందరు కరోనా భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవనం సాగిస్తుంటే కుళ్ళు రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికే చెల్లుతుందని అన్నారు.

Check Also

భక్తుల‌కు గమనిక…

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ భీంగల్‌ నృసింహ ...

Comment on the article