Breaking News

Daily Archives: May 16, 2020

కెసిఆర్ పాల‌నలో విద్యారంగం సర్వనాశనమైంది

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ పాల‌నలో విద్యారంగం అన్ని విధాలుగా నష్టపోవడం జరిగిందని, ఇటీవల‌ మెడికల్‌ పీజీ విద్యార్థుల ఫీజుల‌ను పెంచడాన్ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర శాఖ ఖండిస్తుందని, వెంటనే పెంచిన ఫీజుల‌ను తగ్గించాల‌ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం విలేకరుల‌తో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితే నియామకాలు జరుగుతాయని ఎదురుచూసిన నిరుద్యోగుల‌కు కన్నీళ్లే మిగిలాయని, మాయమాటలు చెప్పి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల‌ను, నిరుద్యోగుల‌ను రెచ్చగొట్టి వారి ...

Read More »

బాన్సువాడ అభివృద్దిపై పోచారం భాస్కర్‌రెడ్డి సమీక్ష

బాన్సువాడ, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల‌పై అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టు ఏజెన్సీల‌తో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి సమీక్షించారు. స్పెషల్‌ డెవప్‌ మెంట్‌ ఫండ్‌ ద్వారా బాన్సువాడ పట్టణంలో చేస్తున్న సిసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి వ్యవస్థ పనుల‌పై వార్డుల‌ వారీగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణాన్ని అభివృద్ధి చేయించడానికి స్పెషల్‌ డెవల‌ప్‌ మెంట్‌ నిధులు మంజూరు ...

Read More »

మిగిలిన ఒక్కరు డిశ్చార్జ్‌

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నుండి హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మిగిలిన ఒక్క కోవిడ్‌ పేషెంట్‌ కూడా శనివారం డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుండి 61 మందికి కరోనా పాసిటివ్‌ నిర్ధారణ కాగా వారందరినీ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్చిన విషయం అందరికీ తెలిసిందే. వారంతా శనివారంతో డిశ్చార్జ్‌ కావటం సంతోషించదగ్గ విషయమని అలాగే దాదాపు గత నెల‌ రోజులుగా జిల్లాలో ...

Read More »

జిల్లాలో మరో ఇండస్ట్రియల్‌ పార్కు

నిజామాబాద్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో మరో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ భూముల‌ను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి పరిశీలించారు. శనివారం నిజామాబాద్‌ శివారు ప్రదేశాలైన డిచపల్లి మండలంలోని మెంట్రాజ్‌ పల్లి, జాక్రాన్‌ పల్లి మండల‌ శివారు ప్రదేశాలు, ఆర్మూర్‌ మండలంలోని పెరికిట్‌, అంకాపూర్‌ మండలం, నందిపేట్‌ మండలాల‌ పరిసర ప్రాంతాల‌ను పర్యటించి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల ల‌భ్యత ఏ మేరకు ఉన్నది, వ్యవసాయ భూములు ఏ మేరకు ...

Read More »

రూ.1500 తీసుకునే వారి వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 ఆర్థిక సహాయం తీసుకునే వారి వివరాలు సేకరించి వెంటనే సమర్పించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ తహశీల్‌దార్లను ఆదేశించారు. శనివారం జనహితలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్‌డిఓ, డిఎస్పి, తహశీల్‌దార్లు, ఎండిఓలు, ఎఓల‌తో కరోనాపై తీసుకుంటున్న చర్యలు, సాగులో లేని వ్యవసాయ భూములు, ల్యాండ్‌ బ్యాంక్‌ కార్యకమాల‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పేదల‌కు రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

ప్రధానమంత్రి సహాయనిధికి రిటైర్డ్‌ ఉద్యోగుల విరాళం

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ వంతు బాధ్యతగా కామారెడ్డి జిల్లా రిటైర్డ్‌ ఉద్యోగులు తమ ధర్మనిధి నిధుల‌ నుండి ప్రధాన మంత్రి కేర్‌ ఫండ్‌కు రూ.51 వేల‌ రూపాయల విలువ గల‌ చెక్‌ను శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌కు ఆయన ఛాంబర్‌లో అందచేశారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగుల‌ ప్రతినిథులు నిట్టు విఠల్‌ రావు, విశ్వనాథం, గంగా గౌడ్‌, ఖుతుబుద్దీన్‌, కెబి నాగభూషణం, కృష్ణమూర్తి తదితరులు ...

Read More »

కండువాలు మార్చుడు ఆపి పాల‌నపై దృష్టిపెట్టండి

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన 203 జీవోకు నిరసనగా, తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన జలాల‌ను శ్రీశైలం ప్రాజెక్టు నుండి అన్యాయంగా నీటిని తరలిస్తున్న దానికి వ్యతిరేకంగా శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో న‌ల్ల‌ జండా, న‌ల్ల‌ బ్యాడ్జీతో ఉదయం 10 గంటల‌నుండి 11 గంటల‌వరకు నిరసన దీక్ష చేపట్టినట్టు జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ...

Read More »

తల్లి, బిడ్డ సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లి బిడ్డ సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌కు సూచించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో వైద్య అధికారుల‌తో సమీక్షిస్తూ, గర్భిణీ స్త్రీల‌ రిజిస్ట్రేషన్‌ సరిగా నమోదు చేయాల‌ని, వంద శాతం ఇమ్యునైజేషన్‌ చేయాల‌ని, ప్రభుత్వ ఆసుపత్రుల‌లో 80 శాతం పైగా డెలివరీ శాతం నమోదు కావాల‌ని తెలిపారు. ఆసుపత్రుల‌లో ఒపిటి కూడా తగ్గకుండా చూడాల‌ని, హైరిస్క్‌ కేసుల‌ విషయంలో అప్రమత్తంగా వుండాల‌ని, మాతా, శిశు ...

Read More »

కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి…

కామారెడ్డి మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌సి సెల్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అంబర్‌ పేట్‌ ఎంపిటిసి పిరంగి రాజేశ్వర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి శనివారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాస పార్టీ కండువా కప్పుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

Read More »

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బిజెపి నిరసన

ఆర్మూర్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు పోతిరెడ్డిపాడు నీటి ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల‌కు నిరసనగా శనివారం ఆర్మూర్‌ పట్టణంలో బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ ఇంటిపై న‌ల్ల‌ జెండా ఎగురవేసి గంట పాటు నిరసన వ్యక్తం చేశారు. జీవో 203 రద్దు చేయాల‌ని అలాగే పెంపును వెంటనే ఉపసంహరించుకోవాల‌ని, ఇద్దరు ముఖ్యమంత్రులు రహస్య ఒప్పందం చేసుకొని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వీరిపై ...

Read More »

ప్రేమ జంట ఆత్మహత్య

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల‌ కేంద్రంలో శనివారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్ప‌డిరది. మాచారెడ్డి గ్రామానికి చెందిన ఈరం బాల్‌ నర్సు (38), ఎర్రోళ్ల ప్రేమల‌త (35) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. కొంత కాలంగా ఇరువురి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. కాగా బాల్‌ నర్సుకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ప్రేమల‌తకు భర్త, కుమారుడు వున్నారు. వీరి వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్యకు ...

Read More »