Breaking News

జిల్లాలో మరో ఇండస్ట్రియల్‌ పార్కు

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో మరో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ భూముల‌ను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి పరిశీలించారు. శనివారం నిజామాబాద్‌ శివారు ప్రదేశాలైన డిచపల్లి మండలంలోని మెంట్రాజ్‌ పల్లి, జాక్రాన్‌ పల్లి మండల‌ శివారు ప్రదేశాలు, ఆర్మూర్‌ మండలంలోని పెరికిట్‌, అంకాపూర్‌ మండలం, నందిపేట్‌ మండలాల‌ పరిసర ప్రాంతాల‌ను పర్యటించి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల ల‌భ్యత ఏ మేరకు ఉన్నది, వ్యవసాయ భూములు ఏ మేరకు ఉన్నవో వాకబు చేశారు.

అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ఈ ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో మరో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేసే అవకాశమున్నదని అందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాల‌ను గుర్తించి వాటి వివరాల‌ను ఆదివారం సాయంత్రం లోపు వివరాలు పంపవల‌సిందని సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్‌ల‌ను ఆదేశించామని, వివరాలు అందిన వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు.

పర్యటనలో నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటయ్య, ఆర్మూర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌, జిల్లా ఇండస్ట్రీస్‌ మేనేజర్‌ దినేష్‌, సంబంధిత మండలాల‌ తహసీల్దార్‌లు తదితరులు ఉన్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *