Breaking News

మిగిలిన ఒక్కరు డిశ్చార్జ్‌

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నుండి హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మిగిలిన ఒక్క కోవిడ్‌ పేషెంట్‌ కూడా శనివారం డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా నుండి 61 మందికి కరోనా పాసిటివ్‌ నిర్ధారణ కాగా వారందరినీ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్చిన విషయం అందరికీ తెలిసిందే. వారంతా శనివారంతో డిశ్చార్జ్‌ కావటం సంతోషించదగ్గ విషయమని అలాగే దాదాపు గత నెల‌ రోజులుగా జిల్లాలో ఒక్క పాసిటివ్‌ కేస్‌ కూడా నమోదు కాకపోవడం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలందరి కృషి వల్లె సాధ్యమైందన్నారు. కరోనా ఉపద్రవం ఇంతటితో ముగిసి పోలేదని ఆల‌సత్వంవహిస్తే మరింత విజృభిస్తుందని ఇకపై ప్రతి ఒక్కరూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌ని మాస్కులు, శానిటీజర్లు ఉపయోగించాల‌ని భౌతికదూరం పాటించాల‌ని అన్నారు.

జిల్లాలోని అన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌లు తొల‌గించామని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు వహిస్తే త్వరలో మన జిల్లా ఆరెంజ్‌ జోన్‌ నుండి గ్రీన్‌ జోన్లోకి మారుతుందని జిల్లా కలెక్టర్‌ అన్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *