Breaking News

Daily Archives: May 17, 2020

కామారెడ్డి ప్రజల‌కు పోలీసుల‌ హెచ్చరిక

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ సందర్భంగా కొంతమంది పాత నేరస్థులు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న వారు దొంగతనం చేసేందుకు అవకాశం ఉన్నందున కనీస జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరమని కామారెడ్డి పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చినపుడు వారిని దూరంగా ఉంచి మాట్లాడాల‌ని, అనుమానితులు మీ వీధుల్లో సంచరించినట్లయితె వెంటనే సంబందిత పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాల‌ని పేర్కొన్నారు. మీరు ఇంటికి తాళం వేసి పక్క ఉళ్ళకు వెళ్ళినపుడు ...

Read More »

పరిసరాల‌ పరిశుభ్రతకు ప్రతి ఆదివారం పదినిమిషాలు

బాన్సువాడ, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం- పది గంటల‌కు- పదినిమిషాలు’’ లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని క్యాంప్‌ కార్యాల‌యంలో పడి ఉన్న చెత్తను తీసేసి, చెట్లల్లో నిలువ నీటిని తొల‌గించి, తాజా నీటితో నింపారు. ఈ సందర్భంగా భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారి ఇంటి పరిసరాల‌లో నిలువ ఉన్న చెత్తను, ...

Read More »

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యెండల ల‌క్ష్మినారాయణ మాట్లాడుతూ ఆత్మ నిర్బర్‌ భారత్‌ కింద 20 లక్షల‌ కోట్లు కేటాయించడంతో కరోనా ప్రభావం వ‌ల్ల‌ దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాల‌ను ఆదుకొనేందుకు అవకాశమేర్పడిరదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం దేశం మొత్తంలోని రైతులు, పేద ప్రజలు, వ్యవసాయ ...

Read More »

వృధా నీటిని తొల‌గించి దోమలు పునరుత్పత్తి కాకుండా చేయాలి

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్‌ గున్యా, డెంగ్యూ లాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటి నుండే తీసుకోవాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. రాష్ట్ర పురపాల‌క, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల‌కు పది నిమిషాల‌ పాటు నీటి నిలువ‌ను తొల‌గించాల‌ని ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోని ఫౌంటెన్‌లో ...

Read More »

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ పాటు ప్రతిఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో, పూల‌ తోటల‌లో, కుండీల‌లో, పాత పనికిరాని వస్తువుల‌లో నీళ్ళు నిలువ‌ ఉంటే శుభ్రపరుచుకోవాల‌ని రాష్ట్ర పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తమ కాంప్‌ కార్యాల‌యం ఆవరణలోని పూల‌ కుండీల‌లోని నీటిని స్వయంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ వంటి ...

Read More »

ఘనంగా పెద్దమ్మతల్లి ఆల‌య వార్షికోత్సవం

నందిపేట్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం తొండాకురు గ్రామంలో పెద్దమ్మతల్లి ఆల‌య 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిటిసి రాణి మురళీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా నేపథ్యంలో అమ్మవారి ఆల‌యం వద్ద భక్తులు సామాజిక దూరం పాటించాల‌న్నారు. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కు ధరించాల‌ని ఎంపిటిసి సూచించారు. కార్యక్రమంలో గ్రామ ముదిరాజు కుల‌స్ఠులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఆదివారం పది నిమిషాలు సామాజిక కార్యక్రమం

బాన్సువాడ, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం- పది గంటల‌కు- పదినిమిషాలు’’ కార్యక్రమంలో ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. స్పీకర్‌ తన అధికారిక నివాసంలోని పూల‌ కుండీల‌లో చెత్తను తొల‌గించి తాజా నీటితో నింపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ మానవులు ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చదనం, పరిశుభ్రత అత్యంత ప్రాముఖ్యమైనవని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాల‌ను కూడా పరిశుభ్రంగా ...

Read More »

వల‌స కార్మికుల‌కు హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆహారం పంపిణీ

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో పెర్కిట్‌ చౌరస్తా వద్ద జాతీయరహదారిపై నాగ్‌పూర్‌ వైపు వెళ్తున్న వల‌స కూలీల‌కు శనివారం రాత్రి ఆహారపదార్ధాలు, వాటర్‌ బాటిళ్ళు అందజేశారు. అంతకు ముందు హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఇండియా ప్రతినిధులు గుండు నరేష్‌, జిల్క‌ర్‌ విజయానంద్‌, లావణ్య, చింతల‌ గంగాదాస్‌ సొంతంగా ఇంట్లోనే టమాటా చట్నీ, చపాతీలు, తాలింపు పేలాలు తయారు చేసి పంపిణీకి సిద్దం చేశారు. వీటితో పాటు వాటర్‌ బాటిళ్ళు, బిస్కట్లు ...

Read More »

కోవిడ్‌ పరిశోధనల‌కు కామారెడ్డిలో రక్తనమూనాల‌ సేకరణ

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేసిన ఐదు మండలాల్లోని ఐదు గ్రామాల్లో ప్రతి గ్రామంలో 40 కుటుంబాల‌ చొప్పున ఐసిఎంఆర్‌ బృందం రక్తనమూనాలు సేకరించినట్టు డిఎం అండ్‌ హెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. సేకరించిన రక్తాన్ని పరీక్షల‌ నిమిత్తం చెన్నై వైరాల‌జీ కేంద్రానికి పంపామన్నారు. ఈ సందర్భంగా డిఎం అండ్‌ హెచ్‌వో మాట్లాడుతూ అన్ని డివిజన్‌ల‌ పరిధిలో మండలాల‌ను ఎంపిక చేశామని, రక్త పరీక్షల వల‌న వైరస్‌ సంక్రమించడానికి ...

Read More »