Breaking News

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యెండల ల‌క్ష్మినారాయణ మాట్లాడుతూ ఆత్మ నిర్బర్‌ భారత్‌ కింద 20 లక్షల‌ కోట్లు కేటాయించడంతో కరోనా ప్రభావం వ‌ల్ల‌ దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాల‌ను ఆదుకొనేందుకు అవకాశమేర్పడిరదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం దేశం మొత్తంలోని రైతులు, పేద ప్రజలు, వ్యవసాయ రంగానికి, కార్మికులు, చిన్న పరిశ్రమల‌కు, బ్యాంకు లోన్లు తీసుకున్న ఋణ గ్రహీతల‌కు మారటోరియంతో అన్ని వర్గాల‌ ప్రజల‌ను ఆదుకునేందుకు కేటాయించారన్నారు. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేషన్‌ కార్డు లేని వల‌సకూలీల‌కు రేషన్‌ బియ్యం, పప్పు ఇచ్చి ఆదుకుంటామని మాటల‌కే పరిమితమై కనిసం ఆదుకోలేని సమయంలో నరేంద్రమోదీ నిధులు కేటాయించి తక్షణమే రేషన్‌ కార్డు లేని పేదల‌కు రేషన్‌ అందించాల‌ని రాష్ట్రాల‌కు నిధులు కేటాయించారన్నారు.

అనంతరం నగర అధ్యక్షుడు యెండల‌ సుధాకర్‌ మాట్లాతూ దేశ భవిష్యత్‌ కోసం ప్రధాని 137 కోట్ల ప్రజల‌కు నిధులు ప్రజల‌ రక్షణకై తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాల‌ను యావత్తు ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో జేజేలు పలుకుతున్నాయన్నారు. అట్టడుగు ప్రజల‌ నుండి మెదలుకొని అన్నివర్గాల‌ ప్రజల‌ శ్రేయస్సుకు నిధులు కేటాయించినందుకు పాలాభిషేకం చేశామన్నారు.

కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్‌ సభ్యులు టక్కర్‌ హన్మంత్‌ రెడ్డి, సోమాని, శ్రీనివాస్‌ శర్మ, స్వామి యాదవ్‌, నాగరాజు, గంగోని గంగాధర్‌, కెప్టెన్‌ రాజు, నరేష్‌, విగ్నేష్‌, చైతన్య కుల‌కర్ణి, భూపాల్‌ రెడ్డి, నారాయణ యాదవ్‌, భరత్‌ భూషణ్‌, అదే నరేందర్‌, పంచరెడ్డి ల‌క్ష్మణ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *