Breaking News

వల‌స కార్మికుల‌కు హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆహారం పంపిణీ

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో పెర్కిట్‌ చౌరస్తా వద్ద జాతీయరహదారిపై నాగ్‌పూర్‌ వైపు వెళ్తున్న వల‌స కూలీల‌కు శనివారం రాత్రి ఆహారపదార్ధాలు, వాటర్‌ బాటిళ్ళు అందజేశారు. అంతకు ముందు హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఇండియా ప్రతినిధులు గుండు నరేష్‌, జిల్క‌ర్‌ విజయానంద్‌, లావణ్య, చింతల‌ గంగాదాస్‌ సొంతంగా ఇంట్లోనే టమాటా చట్నీ, చపాతీలు, తాలింపు పేలాలు తయారు చేసి పంపిణీకి సిద్దం చేశారు.

వీటితో పాటు వాటర్‌ బాటిళ్ళు, బిస్కట్లు కూడా వల‌సకూలీల‌కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఇండియా ప్రతినిధి గుండు నరేష్‌ మాట్లాడుతూ తమ సంస్థ ఆద్వర్యంలో లాక్‌ డౌన్ వ‌ల్ల‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల కోసం నెల‌ రోజులుగా వివిద సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇక్కడి వల‌స కూలీలు దుర్బర పరిస్థితులు చూసి అమెరికాలో ఉన్న హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీల‌త కొరడా, స్వప్న రమేష్‌ ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.

వారి సహకారంతో జిల్లాలో 50 మందికి పైగా నిరుపేదల‌కు నిత్యావసరాలు పంపిణీ చేశామని, అనేకసార్లు వల‌సకూలీల‌కు ఆహారపదార్ధాలు అందజేశామని వివరించారు. కార్యక్రమంలో హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ప్రతినిధుల‌తో పాటు అంకాపూర్‌కు చెందిన యువకులు చందు, వికాస్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, వంశీ, అభీ, రాకేష్‌, దినేష్‌, సాయితేజ, మనోజ్‌, విజయ్‌, శ్రీను, చింటూ, బన్ని పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *