Breaking News

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ పాటు ప్రతిఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో, పూల‌ తోటల‌లో, కుండీల‌లో, పాత పనికిరాని వస్తువుల‌లో నీళ్ళు నిలువ‌ ఉంటే శుభ్రపరుచుకోవాల‌ని రాష్ట్ర పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తమ కాంప్‌ కార్యాల‌యం ఆవరణలోని పూల‌ కుండీల‌లోని నీటిని స్వయంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధుల‌ నుండి కాపాడుకుందామన్నారు.

వ్యాధులు ప్రబల‌కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేయదల‌చిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. మున్సిపల్‌ చైర్మన్లను, శాసన సభ్యుల‌ను కార్యక్రమంలో భాగస్వాముల‌ను చేయాల‌ని సూచించారు. ఎవరి ఇండ్లల్లో వారు నిలువ ఉన్న నీటిని పారబోయాల‌ని, దోమల‌ లార్వా పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల‌ని, కౌన్సిల‌ర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌లు, మేయర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ నివాసాల‌లో వృధా నీరు నిల‌వకుండా చూడాల‌న్నారు.

మున్సిపాలిటీలో ప్రజల‌కు ఇబ్బంది కాకుండా చూడాల‌న్నారు. వేస్ట్‌ డిస్పోజల్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల‌ని, శానిటేషన్‌ విషయంలో మనకు మంచి పేరు వచ్చిందని, దాన్ని కాపాడాల‌న్నారు. మున్సిపాలిటీ పరిధిలో సంయుక్తంగా ఎక్కడికక్కడ నివారణ చర్యలు తీసుకోవాల‌ని కలెక్టర్‌ తెలిపారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *