Breaking News

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద జాతీయరహదారి మీదుగా నాగ్‌పూర్‌ వైపు వెళ్తున్న వల‌స కూలీల‌కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పాటికే అనేక సార్లు ఆహారపదార్ధాలు, వాటర్‌ బాటిళ్ళు, చపాతీలు, బ్రెడ్లు అందజేసిన హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ సోమవారం బోజన సదుపాయాలు కల్పించింది.

గత 50 రోజుల‌ నుండి దాతల‌ సహకారంతో పేదల‌కు బోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్న ముత్యం నరేష్‌ ద్వారా హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముత్యాల‌ నరేష్‌ మాట్లాడుతూ వల‌స కూలీల‌ కోసం తాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల‌కు హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఎంతో సహకారం అందిస్తుందన్నారు.

సోమవారం సంస్థ దాతగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించిందన్నారు. కార్యక్రమంలో హెల్ఫ్‌ టు అదర్స్‌ ఇండియా ప్రతినిధులు గుండు నరేష్‌, జిల్క‌ర్‌ విజయానంద్‌ పాల్గొన్నారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *