Breaking News

ప్రభుత్వం ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనవద్దు

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, ఎమ్మార్వోలు, రైతు సమన్వయ సభ్యులు తదితరుల‌తో సమీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ పాల‌సీ ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనుగోలు చేయవద్దని, ఒకటి రెండు రోజుల‌లో స్పష్టత వస్తుందని, జిల్లాలో ప్రతి రైతుకు లాభం వచ్చేలా ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు వేయాలో అధికారులు సూచిస్తారని అన్నారు.

గత సంవత్సరం జిల్లాలో మూడు ల‌క్షల‌ ఎకరాల్లో వరి సాగయిందని, డిమాండ్‌ ఉన్న పత్తి, కంది, కూరగాయలు వంటి పంటలు ఎక్కువగా సాగుచేస్తే రైతుల‌కు లాభసాటిగా ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారులు ముఖ్య పాత్ర పోషించాల‌ని, రైతుల‌కు సరైన రీతిలో తెలియచేసి నమ్మకం కలిగించాల‌ని, ప్రతి క్లస్టర్‌లో రైతు వేదికలు ఏర్పరుచుకోవాల‌న్నారు. ఏఈఓలు గ్రూప్‌లు ఏర్పరుచుకొని రైతుల‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల‌ని, ప్రతి విషయం రైతుల‌కు తెలియాల‌ని కలెక్టర్‌ అన్నారు.

రైతులు తమ పొలానికి అవసరమైన ఒండ్రు మట్టిని తమ గ్రామంలోని చెరువుల‌ నుండి ఎటువంటి అనుమతి లేకుండా తీసుకోవచ్చని, వ్యాపార రీతుల్లో సేకరిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని రైతుల‌కు తెలియచేయాల‌న్నారు. పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరం మేరకు రెవిన్యూ, ఇతర శాఖల‌ సహకారం తీసుకోవాల‌ని ఏఈఓల‌ కు సూచించారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని ...

Comment on the article