Breaking News

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. సోమవారం హైదరాబాద్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధికంగా విత్తన ఉత్పత్తి చేస్తున్నామని, అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ ఆఫీసర్‌లు, రైతు బంధు సభ్యుల‌ సమన్వయంతో పని చేయాల‌ని, రైతును రాజును చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.

రైతులు ప్రభుత్వం సూచించిన పంటను వేయాల‌ని, అప్పుడే రైతు బంధు వస్తుందని అన్నారు. ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఇన్సూరెన్స్‌ ఇస్తున్నామని, 50 వేల‌ రుణాలు మాఫీ చేశామని, 35 వేల‌ కోట్ల రూపాయల‌తో పంట కొనుగోలు చేశామన్నారు. మన రాష్ట్రంలో ప్రధానంగా మూడు రకాల‌ పంటలు పండుతున్నాయని, వరి దాదాపు 79 ల‌క్షల‌ ఎకరాలు, పత్తి 53 ల‌క్షల‌ ఎకరాల‌లో, మొక్కజొన్న 20 ల‌క్షల‌ ఎకరాల్లో పండిస్తున్నారని అలాగే నిజామాబాద్‌ జిల్లాలో పసుపు దాదాపు ల‌క్ష పైచిలుకు ఎకరాల‌లో సాగు చేస్తున్నారన్నారు.

పంటలో నియంత్రణ ఉండాలి అని, ఏ పంట వేస్తే లాభం వుంటుందో చూసుకొని వేయాల‌ని, డిమాండ్‌ లేని పంటలు వేయవద్దని సిఎం సూచించారు. ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో వ్యవసాయ శాఖ అధికారులు తెలియచేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల‌తో సమీక్షించి, జిల్లా కలెక్టర్‌లు డిమాండ్‌ ఉండే పంటలు వేసేలా చూడాల‌ని, ప్రభుత్వం సూచించిన పంటలు వేయనట్లైతే రైతు బంధు రాదన్న విషయం తెలియచేయాల‌న్నారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *