Breaking News

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌, మేయర్‌ నీతూ కిరణ్‌, అధికారుల‌తో కలిసి పరిశీలించారు. 7వ డివిజన్‌లో 35 ల‌క్షల‌ రూపాయతో (టియుఎఫ్‌ఐడిసి నిధులు) నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల‌ను పరిశీలించారు. తిరుమల‌ టాకీస్‌ చౌరస్తా వద్ద డిసిల్టేషన్‌ పనుల‌ని (మురుగు క్వాలో పూడికతీత) పనుల‌ని పరిశీలించారు.

బోధన్‌ రోడ్డులో 60 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మిస్తున్న క‌ల్వ‌ర్టు నిర్మాణ పనుల‌ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనుల‌లో నాణ్యత లోపించకుండా సాధ్యమైనంత త్వరలో ప్రజల‌కి అందుబాటులోకి రావాల‌ని, నగరంలో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఉండదు కనుక పనులు వేగవంతం చేయాల‌న్నారు. పని చేసే కార్మికులు, అధికారులు మాస్కులు దరిస్తూ భౌతిక దూరం పాటించాల‌ని ఎమ్మెల్యే సూచించారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *