Breaking News

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసి రైతు లాభాలు గడిరచేలా చూడాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, డీల‌ర్స్‌, సమన్వయ సభ్యులు తదితరుల‌తో కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో కలెక్టర్‌ సమీక్షించారు.

ప్రభుత్వం వ్యవసాయ పాల‌సీ రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నదని, అప్పటి వరకు రైతులు వరి సీడ్‌ కొనుగోలు చేయవద్దని, జిల్లాలో ప్రతి రైతుకు లాభం వచ్చేలా ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు వేయాలో అధికారులు సూచిస్తారని, గత సంవత్సరం జిల్లాలో అవసరానికి మించి వరి, మొక్కజొన్న తదితర పంటలు సాగు అయ్యాయని, డిమాండ్‌ ఉన్న పత్తి, కంది, కూరగాయలు వంటి పంటలు ఎక్కువగా సాగుచేస్తే రైతుల‌కు లాభసాటిగా ఉంటుందన్నారు.

ఇప్పటికే వరి, మొక్కజొన్న ప్రభుత్వం వద్ద అధికముగా స్టోరేజ్‌ ఉన్నదని, అందుకనే మొక్కజొన్న పంట వేయవద్దని, సీడ్ డీల‌ర్స్‌ మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దని, అదేవిధంగా వరి కూడా ప్రభుత్వం సూచించిన రకం వేయాల‌ని తెలిపారు. నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మవద్దని, ఈ సంవత్సరం వరి 20 శాతం తగ్గించి, దాని బదులు డిమాండ్‌ ఉన్న పత్తి, కంది వంటి పంటలు వెయ్యాల‌ని, వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం అన్ని విధాలా ఉంటుందని, అదేవిధంగా సోయాబిన్‌, పసుపు పంటల‌కు మేలైన విత్తనాలు అమ్మాల‌న్నారు.

నిజామాబాదులో కూరగాయలు అవసరమైన దానిలో 50 శాతం మాత్రమే పండిస్తున్నామని, మిగతావి బయట నుండి వస్తున్నవని తెలిపారు. వరిలో డిమాండ్‌ ఉన్న పంటను మాత్రమే ప్రోత్సహించాల‌ని, రైతూ బాగుండాలి, ప్రభుత్వమూ బాగుండాల‌ని, రైతుకు లాభము జరగాల‌న్న ఉద్దశేముతో ప్రభుత్వం ప్రాంతాన్ని బట్టి, లాభసాటి అయిన పంటలు సూచిస్తుందని, అధికారుల‌ సూచన మేరకు రైతులు పంటలు వేయాల‌ని కలెక్టర్‌ అన్నారు.

వ్యవసాయ అధికారులు ముఖ్య పాత్ర పోషించాల‌ని, రైతుల‌కు సరైన రీతిలో సూచనలు చేసి నమ్మకం కలిగించాల‌ని, ప్రతి క్లస్టర్‌లో రైతు వేదికలు ఏర్పరుచుకోవాల‌ని, ఏఈఓలు గ్రూప్‌లు ఏర్పరుచుకొని రైతుకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల‌ని, ప్రతి విషయం రైతుకు తెలియాల‌ని అన్నారు. సమావేశంలో అగ్రిక‌ల్చ‌ర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గోవింద్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఏఈఓలు, డీల‌ర్లు, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని ...

Comment on the article