Breaking News

వల‌స కార్మికుల‌ను పట్టించుకోని ప్రభుత్వాలు

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్టంలో, మరియు, మహారాష్ట్ర, బీహార్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఢల్లీి, ఇతర రాష్ట్రాల వల‌స కార్మికుల‌ పరిస్తితి చాలా దారుణంగా ఉందని ప్రభుత్వాలు వల‌స కార్మికుల‌ను ఆదుకోవడంలో పూర్తిగా విఫల‌మయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాల‌యంలో జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నాయకులు న‌ల్ల‌ బట్టల‌తో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వల‌స కార్మికుల‌ను తమ సొంత ప్రదేశాల‌కు చేరవేయడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని, అలాగే ట్రైన్‌లో కనీసం 1500 మంది చొప్పున వెళ్లాల్సి ఉండగా కేవలం 700, 800 మంది మాత్రమే వెళ్తున్నారని అంటే దీన్ని బట్టి కార్మికుల‌కు ప్రయాణం పట్ల ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వలేదని తెలుస్తుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అంకెల‌ గారడి అని దీని వ‌ల్ల సామాన్య, మధ్య, వల‌స కూలీల ప్రజల‌కు ఎటువంటి ప్రయోజనం లేదని దశరథ్‌ అన్నారు.

వల‌స కూలీలు నడిచే ప్రాంతాల్లో కనీసం చలి వేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వల‌స కూలీలు ఆకలితో నడవలేక చనిపోతున్నారని కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు వల‌స కార్మికుల‌ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరిని తమ సొంత ప్రాంతాల‌కు వెళ్లే విదంగా చర్యలు తీసుకోవాల‌ని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.బాల‌రాజు, జిల్లా నాయకులు ఎస్‌.ఆర్‌ శేఖర్‌, బండారి రాజిరెడ్డి, నరేష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *