Breaking News

ఆరోగ్య సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు పరచాలి

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆరోగ్య సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలుపరచాల‌ని, గర్భిణీల‌కు రెండవసారి వైద్యపరీక్ష తర్వాత మొదటిసారి కెసిఆర్‌ కిట్‌ పథకం విడుదల‌ చేయటానికి అవసరమైన డాటా పోర్టల్‌లో నమోదు చేయాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి చంద్రశేఖర్‌ అన్నారు.

మంగళవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సిహెచ్‌సి ఏరియా ఆసుపత్రి సీనియర్‌ సహాయకులు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పర్యవేక్షల‌కు అడ్మినిస్ట్రేటివ్‌ అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో కాన్పులు అయిన వెంటనే కెసిఆర్‌ కిట్‌ ఇవ్వాల‌ని, వారికి అందవల‌సిన సేవ‌లు అందించాల‌ని, పిల్ల‌ల‌కు పూర్తి టీకాలు అయిన తర్వాత తుది విడత మంజూరుకోసం పోర్టల్‌ నమోదు చేయాల‌ని, బర్త్‌ సర్టిఫికెట్‌లు ఆన్‌లైన్‌ అందించాల‌న్నారు. కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఏవోలు తదితరులున్నారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *