Breaking News

ఇంటినుంచి తప్పిపోయిన చిన్నారి

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొడుగుమర్రి గ్రామం మునిప్ప తండాకు చెందిన ముదావత్‌ చందర్‌ కూతురు ముదావత్‌ సంధ్య వయసు 10 సంవత్సరాలు, 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల‌కు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదని కుటుంబీకులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే పాపకు కొద్దిగా మతిస్థిమితంలేదని, ఇంట్లో నుండి వెళ్ళినపుడు నలుపు రంగు గౌన్‌ ఉందని, గుండ్రని ముఖం, తెలుపు రంగులో ఉంటుందన్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి పాప ఆచూకీ కొరకు వెతుకుతున్నట్టు కామారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ రామారెడ్డి తెలిపారు. ఎవరికైనా పాప ఆచూకీ తెలిస్తే రామారెడ్డి పోలీసువారికి సమాచారం అందించాల‌న్నారు. ఎస్‌. ఐ రామరెడ్డి 9490618033, సి.ఐ కామారెడ్డి రూరల్‌ 9440795410 నెంబర్లకు తెలియజేయాల‌న్నారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *