Breaking News

ఆపరేషన్‌ నిమిత్తం గర్భిణీల‌కు రక్తదానం

కామారెడ్డి, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన బాల‌వ్వ (20), బిక్నూర్‌ మండల‌ కేంద్రానికి చెందిన లావణ్య (24), శాబ్ధి పూర్‌ గ్రామానికి చెందిన చంద్రబాగుకు ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహంను సంప్రదించారు.

సమూహ సభ్యుడు కిరణ్‌ సహకారంతో కామారెడ్డి పట్టణానికి చెందిన సంతోష్‌ కుమార్‌, గాలి శ్రీకాంత్‌, ల‌చ్చ పేట గ్రామానికి చెందిన దేవరాజు సహాయంతో 3 యూనిట్ల రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు.

ఈ సందర్భంగా రక్తదాతను, సభ్యులు కిరణ్‌ను బాలు అభినందించారు. లాక్‌ డౌన్‌ నుండి దాదాపు 30 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందని, రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల‌న్నారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌, రోగి బంధువులు పాల్గొన్నారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *