Breaking News

ఇప్పటికిప్పుడు విత్తనాలు ఎక్కడినుండి తెస్తారు…

కామారెడ్డి, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిరచిన పంటకు ధర నిర్ణయించుకునే అదృష్టం ఎలాగూ రైతుల‌కు లేదు, కనీసం తనకు ఇష్టమైన, తన భూమికి అనువైన పంటను పండిరచే హక్కు కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి బీజేపీ కార్యాల‌యంలో విలేకరుల‌తో మాట్లాడారు. రైతు వాన కాలం పంటకు పెట్టుబడిగా ఇవ్వాల్సిన రైతు బందును అధికారులు చెప్పిన పంట వేస్తేనే ఇస్తామని సిఎం చెప్పడం విచారకరమని అన్నారు.

ముఖ్య మంత్రి రైతు బంధు గురించి మాట్లాడితే నిన్న కలెక్టర్లు విత్తనాలు అమ్మే దుకాణం యజమానుల‌కు సమావేశం పెట్టి దొడ్డు రకం వరి విత్తనాలు, మొక్క జొన్న విత్తనాలు అమ్మవద్దని హుకుం జారీ చేశారని, ఇంకా 20 రోజుల్లో పంట వేయాల్సిన సమయంలో ఇప్పటికిప్పుడు విత్తనాలు ఎక్కడి నుండి తీసుకొస్తారని, అంటే ఇంతకు ముందే వాళ్ళ బంధువుల విత్తన కంపెనీలు తయారు చేసిన వాటిని రైతుల‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది కెసిఆర్‌, రైస్ మిల్ల‌ర్లు, విత్తన సంస్థలు (కావేరి, నూజివీడు విత్తన కంపెనీల‌ యజమానులు కెసిఆర్‌ బంధువులు అని గమనించాలి) కలిసి వాళ్ళ లాభాల‌ కోసం రైతు పండిరచే పంటను మార్చాల‌ని చూస్తున్నారని అన్నారు.

దొడ్డురకం వడ్ల దిగుబడికి, సన్న రకం వడ్ల దిగుబడికి ఒక ఎకరాకు సగటున 12 వేల‌ రూపాయల‌ నష్టం రైతుకు వాటిల్లుతుందని, అంతే కాకుండా మొక్క జొన్న పంటకి పట్టి ఇతర పప్పు ధాన్యాల‌ దిగుబడికి సగటున ఒక ఎకరాకు 10 వేలు నష్ట పోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరికి రైతుల‌ను వారి కబంధ హస్తాల‌లో బంధించాల‌ని చూస్తుందని, అయితే బీజేపీ చూస్తూ ఊరుకోదని రైతు బందును ఈ నెల‌లో రైతుల‌ ఖాతాల‌కు మళ్లించి, తనకు ఇష్టమైన పంట పండిరచుకునే అధికారం రైతుకే ఇవ్వాల‌ని డిమాండ్‌ చేసారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *