Breaking News

న్యాయవాది మృతికి సంతాపం

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ న్యాయవాది ల‌ద్దారాం రాంల‌ఖియాని బుధవారం మృతి చెందారు. వారి మృతి పట్ల నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశమై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోవర్దన్‌ మాట్లాడుతూ సీనియర్‌ న్యాయవాది ల‌ద్దారాం న్యాయవాద వృత్తిలో గౌరవ ప్రదంగా ఉంటూ, అసోసియేషన్‌లో అందరితో కలిసి మెలిసి ఉండేవారని, వారి మృతి తీరని లోటన్నారు.

67 సంవత్సరాల‌ పాటు సుదీర్ఘంగా న్యాయవాద వృత్తిలో కొనసాగారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, జగన్‌మోహన్‌ గౌడ్‌, పరుచూరి శ్రీధర్‌, రామారావు, నారాయణ దాస్‌, సుదర్శన్‌రావు, వసంత్‌రావు, సంజయ్‌గౌడ్‌, అమరేందర్‌రావు, కిరణ్‌, సాదుల్లా, మునీర్‌, మానిక్‌ రాజ్‌, ఆశ నారాయణ తదితరులున్నారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *