Breaking News

మొక్కజొన్న పంట వ‌ల్ల‌ నష్టం వాటిల్లుతుంది

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుదవారం జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, తహసీల్దార్‌లు, తదితరుల‌తో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 108 క్లస్టర్‌ కుగాను, 90 క్లస్టర్‌కు సొంత భవనాలు ఉన్నాయని, మిగితా క్లస్టర్‌ల‌కు బిల్డింగ్‌ లేనందున, వాటికి ల్యాండ్‌ రేపటిలోగా చూసి రిపోర్ట్‌ పంపవల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు.

 

అదేవిధంగా జిల్లాలో మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సూచించాలి వంటి విషయాల‌పై చర్చించారు. ఏ పంటలు వేస్తే రైతుకు రాయితీలు అందుతాయో అట్టి పంటల‌ను సూచించాల‌న్నారు. జిల్లాలో అధికారుల‌కుగాని, రైతుల‌కు గాని సందేహాలుంటే తెల‌పమని, అట్టి సందేహాల‌ను రేపు ముఖ్యమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఎట్టి పరిసితుల్లో మొక్కజొన్న పంట వేయవద్దని, దాని వల‌న నష్టమున్న విషయం రైతుల‌కు తెల‌పాల‌ని కోరారు.

మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా కంది, సోయాబిన్‌ పంటలు, కూరగాయలు లేదా ఇంకా వేరే పంటల‌కు ప్లాన్‌ చేయాల‌ని సూచించాన్నారు. వరి సీడ్‌ ప్రభుత్వం చెప్పిన రకం వేసేలా చూడాల‌న్నారు. మోసం చేసే డీల‌ర్లపై నిఘా పెట్టాల‌ని కోరారు. రైతుల‌కు నష్టం రాకుండా చూడాల‌న్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని ...

Comment on the article