Breaking News

స్వర్గీయ రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

బాన్సువాడ, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో డీసీసీ అధ్యక్షుడు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాసరావు, పండ్ల రాజు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజీవ్‌ గాంధి విగ్రహం వద్ద, చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎల్టీటీఈ దాడిలో కన్నుమూసి నేటికి 29 ఏళ్లు అవుతుందని, 1991వ సంవత్సరం మే నెల 21వ తేదీన రాజీవ్‌ గాంధీ విశాఖలో జరిగిన ఎన్నికల‌ బహిరంగ సభకు హాజరై అక్కడినుంచి విమానంలో మద్రాసుకు చేరుకున్నారని, అక్కడినుంచి శ్రీపెరంబుదూరు ఎన్నికల‌ సభకు వెళ్లారన్నారు. వేదికపైకి వెళ్లే ముందు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు పెడుతున్న సమయంలో ఎల్టీటీఈ ఆత్మాహుతి సభ్యురాలు రాజీవ్‌ గాంధీ కాళ్ళకు మొక్కి, ఆర్‌డీఎక్స్‌ బెల్ట్‌ బాంబును పేల్చారన్నారు.

వేల‌ సంఖ్యలో ప్రజలు గుమికూడిన చోట రాజీవ్‌ గాంధీ దారుణ హత్యకు గురి కావడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌తో పాటు మరో 26 మంది చనిపోయారన్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌ దుర్మరణం చెందటంతో నాటి నుంచి మే 21ను ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *