Breaking News

పారిశుద్య సిబ్బందికి సన్మానం, నిత్యవసరాల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల‌ కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వల‌స కూలీల‌కు నిరుపేద కుటుంబాల‌కు రేషన్‌ కార్డు లేని వారిని గుర్తించి 20 కిలోల‌ బియ్యం, నిత్యావసర సరుకుల‌ను సర్పంచ్‌ రేఖ రాజు, తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపీడీవో ఆనంద్‌ చేతుల‌ మీదుగా పంపిణీ చేశారు.

ముందుగా పారిశుద్ధ్య కార్మికుల‌కు సన్మానం చేశారు. అలాగే వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల‌కు గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వెంకట్‌ రావు మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ సమయంలో ప్రాణాల‌కు తెగించి పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రజల‌కు చేసిన సేవ‌లు ఎంతో గొప్పవని వారిని అభినందించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నాగరాజు, వైద్య సిబ్బంది గంగమని, నాగమణి, ఆశా కార్యకర్తలు చంద్రకళ, విజయల‌క్ష్మి, కె,ల‌క్ష్మి, పద్మ, సుమల‌త, అనిత తదితరులున్నారు.

Check Also

షాదీ ముబారక్‌ చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల‌యం వద్ద షాదీ ముబారక్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *