Breaking News

మునిసిపల్‌ సమస్యలు పరిష్కరించాల‌ని ఆర్‌డివోకు వినతి

ఎల్లారెడ్డి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివో వెంకటేష్‌ దోత్రేని గురువారం కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మున్సిపల్‌ పరిదిలోని పలు వార్డుల్లో ముఖ్యంగా 2వ, 6వ, 9వ వార్డుల్లోని మురికి కాలువల‌ సమస్య, నీటి సమస్య ఉందని, ఎల్లారెడ్డిలోని ప్రదాన మురికి కాలువ నిర్మాణం జరిపినప్పటినుండి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చెత్త తొల‌గించలేదని అన్నారు.

రాబోయేది వర్షాకాలం కావున వెంటనే మున్సిపల్‌లోని పలు సమస్యల‌పై స్పందించాల‌ని ఈ సందర్భంగా కోరారు. మున్సిపల్‌లోని 2వ, 6వ, 9వ వార్డుల్లో పర్యటించాల‌ని కోరారు.

Check Also

ఎల్లారెడ్డి పురపాలక తెరాస అభ్యర్థులు వీరే

నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పురపాలన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులను మంగళవారం ఎమ్మెల్యే ...

Comment on the article