Breaking News

ల‌క్ష రూపాయల‌ రైతు రుణమాఫీ చేయాలి

బీర్కూర్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాల‌ని, ల‌క్ష రూపాయల‌ రైతు రుణాల‌ను మాఫీ చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల‌ని నసురుల్లాబాద్‌ మండల‌ భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బిజెపి మండల‌ అధ్యక్షుడు హన్మాండ్లు యాదవ్‌ మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల‌కు ముందు రైతుబంధు పథకం కింద డబ్బు ఏ ప్రాతిపదికన రైతు ఖాతాలో జమచేశారో అదే ప్రాతిపదికన ప్రస్తుతం కొత్తగా అర్హులైన వారితోపాటు రైతులందరికి గత రెండు సీజన్లు, ప్రస్తుత సీజన్‌తో కలిపి సిఎం వాగ్దానం చేసిన విధంగా ఎకరాకు రూ.5 వేలు రైతు ఖాతాల్లో జమచేయాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాము, వడ్ల సతీష్‌, గంగాధర్‌ గుప్తా, సాకేత్‌, సంజీవ్‌, భరత్‌గౌడ్‌, సుభాష్‌ తదితరులున్నారు.

Check Also

మైలారం గ్రామంలో నిరుపేదల‌కు బియ్యం పంపిణీ

బీర్కూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండలం మైలారం గ్రామంలో రేషన్‌ కార్డు లేని ...

Comment on the article