Breaking News

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల‌ ఆహ్వానం

హైదరాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ తేదీన హైదరాబాద్‌ నగరంలో నిర్వహించే తెలంగాణ రత్న పురస్కారాల‌ ప్రదానోత్సవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు యన్‌ డాక్టర్‌ ఇ.ఎస్‌.ఎస్‌ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

కవులు, రచయితలు, సంగీత, నృత్య, రంగస్థల‌, యోగ, వైద్య, క్రీడాకారుల‌ సేవల‌కు గాను పురస్కారం ప్రదానం చేసి వారిని ప్రోత్సహించాల‌నే ల‌క్ష్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆసక్తిగల‌వారు మే 31వ తేదీ లోగా వారి ప్రతిభను తెలియజేసే సర్టిఫికెట్స్‌, వీడియో క్లిప్పింగ్స్‌ను సికింద్రాబాద్‌, గోకుల్‌ నగర్‌లో ఉన్న తమ కార్యాల‌యంలో అందజేయాల‌ని కోరారు. మరిన్ని వివరాల‌కు సెల్‌ నెంబర్‌ 9652347207 ను సంప్రదించాల‌న్నారు.

Check Also

ప్రధాని మోడీ చెప్పిన ఏడు సూత్రాలు

సీనియర్‌ సిటిజన్స్‌ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని వృద్దుల‌ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *