Breaking News

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ డివిజన్‌ అదేవిధంగా జోన్ 4 పరిదిలోని బైపాస్‌ రోడ్డులో జరుగుతున్న పారిశుద్ద పనుల‌ను, స్ట్రోమ్‌ డ్రైనేజ్‌ వాటర్‌ పూడికతీత పనుల‌ను శుక్రవారం నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌ పర్యవేక్షించారు.

వ‌ర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎక్కడ కుడా నీరు నిలువ‌కుండా ఉండేందుకు తీసుకోవల‌సిన చర్యల‌ గురించి అధికారుల‌కు సూచనలు చేశారు. ప్రజలు కుడా తడి, పొడి చెత్త వేరుచేసి మున్సిపల్‌ వాహన సిబ్బందికి అందించాల‌ని, మురుగు కాలువలో ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వ్యర్థపదార్థాలు వేయకూడదని మేయర్‌ విప్తి చేశారు. మేయర్‌ వెంట 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమా రాణి, మున్సిపల్‌ అధికారులు ఏ.ఇ. శంకర్‌, ఏ.ఇ. కొండల్‌ రావ్‌ ఇతర సిబ్బంది ఉన్నారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *