Breaking News

రైతులు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాలి

కామారెడ్డి, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్‌-19, ధాన్యం సేకరణ, సమగ్ర వ్యవసాయ ప్రణాళిక తదితర అంశాల‌పై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా అనంతరం మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కామారెడ్డి జిల్లా కరోనా రహిత జిల్లాగా మారిందని, అత్యవసర సేవల‌ సిబ్బంది, ప్రజాప్రతినిధుల‌ సమన్వయంతో అది సాధ్యమైందని, సహకరించిన అందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా ఇక్కడితో సమసిపోలేదని, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని, మాస్క్‌లు ధరిస్తూ, సామాజిక దూరం కొనసాగించాల‌ని, మాస్కు ధరించకుంటే వెయ్యి రూపాయల‌ జరిమానా విధించాల‌ని మంత్రి పేర్కొన్నారు.

ఇతర ప్రాంతాల‌ నుండి 2817 మంది కామారెడ్డి జిల్లాకు వచ్చారని, మహారాష్ట్ర నుండి 474 మంది వచ్చారని, వీరందరినీ 28 రోజుల‌ పాటు హోమ్‌ క్వారాంటైన్‌ చేశామన్నారు. ఇతర జిల్లాల‌ నుంచి వచ్చిన వారిని కూడా హోం క్వారయింటైన్‌ చేశామని మంత్రి అన్నారు.

ధాన్యం సేకరణ :

3.05 ల‌క్షల‌ ధాన్యం కొనుగోలు ల‌క్ష్యానికి గాను 97 శాతం పూర్తయిందని, ధాన్యం సేకరించిన రెండు మూడు రోజుల్లో రైతు అకౌంట్లో పంట డబ్బు జమ అవుతున్నాయని,
రైతు వద్ద పంటను త్వరగా సేకరించిన పీఏసీ చైర్మన్లను, డీసీసీబీ చైర్మన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. తెలంగాణ రైతు లాభసాటి వ్యవసాయం, గిట్టుబాటు ధర పొందేందుకు కేసీఆర్‌ దృష్టి సారిస్తున్నారని అన్నారు.

5 వేల‌ ఎకరాకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ప్రతి క్లస్టర్‌కు ఒక ఏ.ఈ.ఓ ఉంటారని, ప్రతి క్లస్టర్‌లో 20 ల‌క్షల‌ వ్యయంతో రైతు వేదిక నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు వేదికలో 400 మంది రైతులు కూర్చుండి మాట్లాడుకునే వీలుంటుందని, డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. రైతు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ నూతన విధానానికి రూపక‌ల్ప‌న చేశారని, రైతు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాల‌న్నారు.

వరి, మొక్క జొన్న, పత్తి పంట సాగు ఎలా ఉండాల‌నే విషయంలో లెక్కలు వేశారని, 70 ల‌క్షల‌ ఎకరాల‌ లోపు వరి పంట పండిరచాని, పత్తిని 53 ల‌క్షల‌ నుంచి 70 ల‌క్షల‌కు సాగు విస్తీర్ణం పెంచాల‌ని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మక్కల‌కు కేవలం 20 ల‌క్షల‌ డిమాండ్‌ ఉంది కాబట్టి, 6 ల‌క్షల‌ ఎకరాల్లో పండిరచాల‌ని, వర్షాకాలంలో మక్కపంట వేయద్దని, యాసంగిలొనే మక్కపంట వేయాల‌న్నారు.

కందులు 15 ల‌క్షల‌ ఎకరాల్లో పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు సిద్దంగా ఉన్నామని, కామారెడ్డి జిల్లాలో 4 ల‌క్షల‌ 85 వేల‌ ఎకరాల్లో పంట సాగుకు 2.12 ల‌క్షల‌ ఎకరాల్లో వరి పంట సాగు చేయాల‌ని, 1.6 ల‌క్షల‌ ఎకరాల్లో సన్నరకం, 1.6 ల‌క్షల‌ ఎకరాల్లో దొడ్డు రకం వేయాల‌న్నారు. ఇప్పుడు పండిరచే పంటకు అదనంగా సొయా 20 వేల‌ ఎకరాల్లో, కందులు 30 వేల‌ ఎకరాల్లో సాగుచేయాల‌ని నిర్ణయించామన్నారు.

రైతు పండిరచిన పంటలు ప్రతిసారి ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతు పండిరచిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయదని, కానీ కేసీఆర్‌ 100 శాతం పంటను కొనుగోలు చేశారన్నారు. అందరు ఒకే పంటను వేస్తే డిమాండ్‌ రాదని, లాభసాటి పంటపట్ల దృష్టి సారించాల‌ని, లాభసాటి వ్యవసాయం కోసం ప్రభుత్వం సూచించిన పంటలు వేయాల‌ని కోరుతున్నామన్నారు.

కేసీఆర్‌ రైతు బాంధవుడు, ఆయన కచ్చితంగా రైతు సంక్షేమం కోసమే ఆలోచన చేస్తాడని, స్వయంగా ఆయనే రైతు కాబట్టి రైతు బాధలు తెలుసన్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు, యూనివర్సిటీ విసిల‌తో సమీక్షలు జరిపారని, వారి సూచనమేరకు వ్యవసాయాన్ని లాభసాటి చేసి, రైతు నిర్ణయించిన ధరకు పంట అమ్ముకోవాల‌ని నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల‌ సురేందర్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌, డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.