Breaking News

ప్రణాళికా బద్దంగా వ్యవసాయం చేసి లాభాలు గడించాలి

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలంలో వ్యవసాయంపై మండల‌ స్థాయి అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతు పాత పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తున్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతుతో మాట్లాడి, ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేసి లాభాలు గడిరచేలా మార్గదర్శనం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

రైతు ఒక విజన్‌తో ముందుకు పోవటానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని, ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, వ్యవసాయం లాభసాటిగా సాగేందుకు ప్రణాళికలు తయారు చేస్తుందని, వీటిని రైతుల‌కు వివరించి రైతు డిమాండ్‌ ఉన్న, లాభం వచ్చే పంటలు వేసేలా వ్యవసాయ అధికారులు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ అన్నారు. మన రైతు ఇతర జిల్లాల‌ రైతుల‌కంటే ముందున్నారని, మనం ప్రణాళికతో ముందుకు వెళ్ళితే, వేరే జిల్లాల‌కు ఆదర్శంగా ఉంటామన్నారు.

ఈ విషయంలో జిల్లా అధికారుల కంటే ఫీల్డ్‌ అధికారులు చాలా అదృష్టవంతుల‌ని, రైతుల‌కు సేవ చేసేందుకు వారికి ఒక మంచి అవకాశం వచ్చిందని, రైతులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకోవాల‌ని కోరారు. మొక్కజొన్న పంట రైతుకు మేలు జరగాల‌ని, రైతుకు ఆదాయం వచ్చే పంటలు కంది, సోయాబీన్‌ వంటి పంటలు వేసేలా చూడాల‌న్నారు.

అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ అధికారులు సీడ్స్‌ షాపుల‌ను తనిఖీ చేయాల‌ని, నకిలీ విత్తనాలు అమ్ముతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని, పి.డి యాక్ట్‌ క్రింద కేసు పెట్టాల‌న్నారు. రైతు వేదికను 4 నెలల‌ లోపు పూర్తి చేయాల‌ని, 500 మంది రైతులు కూర్చునేలాగా ఉండాల‌ని, రైతు వేదిక దగ్గర వీడియో కాన్ఫెరెన్సు చేసుకునే విధంగా ఉండాల‌ని, మంచి లొకేషన్‌లో ఉండాల‌ని, ప్రతి సీజన్‌లో ప్రతి పంట రికార్డ్‌ చేయాల‌ని, ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్‌ గ్రూప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ ఉండేలా చూడాల‌ని, దీనిలో అగ్రిక‌ల్చ‌ర్‌ సంబంధించిన సమాచారం మాత్రమే ఉంచాల‌ని, దీనికి ఒక్క షెడ్యూల్‌ తయారు చేసుకోవాల‌ని చెప్పారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *