కామారెడ్డి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రం 1వ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ శంకర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా వేసి టిఆర్ఎస్లోకి ఎంపీటీసీ శంకర్‌ను గంప గోవర్ధన్ ఆహ్వానించారు.
ఎంపీటీసీ సభ్యుడు శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే బాటలో తాను సైతం ఉంటానన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గోపిగౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు గండ్ర మధుసూదన్ రావు, సింగల్ విండో ఛైర్మెన్ నాగరాజ్ రెడ్డి, ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- సకాలంలో మిల్లింగ్ చేయాలి - January 27, 2021
- రికార్డులు పరిశీలించిన కేంద్ర బృందం - January 27, 2021
- మా మంచి కలెక్టర్ - January 27, 2021