Breaking News

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కామారెడ్డి, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి ఆర్‌డిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసిటియు జిల్లా బాధ్యుడు రాజలింగం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కరోనా కట్టడి కోసం గత 70 రోజులుగా విధించిన లాక్‌ డౌన్ వ‌ల్ల‌ దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ కార్మిక వర్గం వేతనాలు రాకా ఉపాధి లేక బిచ్చగాళ్ళుగా మారుతున్నా పట్టించుకోకుండా దేశంలోని కార్పొరేట్‌ సంస్థల‌కు లాభం చేకూర్చే ప్యాకేజీలు ప్రకటిస్తూ కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

అసంఘటిత రంగంలోని నిర్మాణ రంగ కార్మికుల‌కు మొదటి ప్యాకేజీలో 31 వేల‌ కోట్ల రూపాయలు కేటాయించినా కార్మికుల‌కు ఒక్క రూపాయి కూడా చేరలేదని ఆక్షేపించారు. నాలుగో విడత ప్యాకేజీ 20 ల‌క్షల‌ కోట్లు ప్రకటించినా రాష్ట్రాల్లోనే ప్రజల‌కు అప్పుల‌ రూపంలో ఇవ్వడం విడ్డూరమన్నారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ గుజరాత్‌ రాష్ట్రాల్లో కార్మిక చట్టాల‌ను రద్దు చేస్తూ ఎనిమిది గంటల‌ పని సమయాన్ని 12 గంటలు చేయాల‌ని నిబంధన పెట్టడం తక్షణం మానుకోవాల‌ని డిమాండ్‌ చేశారు.

నిర్మాణ రంగ కార్మికుల‌కు వెల్ఫేర్‌ బోర్డు నిధుల‌ నుండి లాక్‌ డౌన్‌ ముగిసేవరకు నెల‌కు ఐదు వేల‌ రూపాయలు కేటాయించాల‌ని, షాపు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల‌ను తక్షణం విధుల్లోకి తీసుకోవాల‌ని కేంద్ర కార్మిక చట్టాల‌ను పకడ్బందీగా అమలు చేయాల‌ని డిమాండ్‌ చేశారు. కార్మికుల‌ హక్కులు కాల‌రాయడం చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఏఐసిటియు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కార్మిక వ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, ఉపాధ్యక్షుడు మద్దెల‌ రాజయ్య, గౌరవ అధ్యక్షుడు తిరుపతి, ఇ సిద్దయ్య, లింగం, బాల‌రాజు, శివరాజు, రాజమణి, విజయ ల‌క్ష్మి, సరస్వతి, జయ, స్వాతి వివిధ రంగాల‌ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలో చేరిన ఎంపిటిసి నిమ్మ శంకర్‌

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల‌ కేంద్రం 1వ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *