Breaking News

కోడ్ ఉల్లంఘించారు

నిజామాబాద్‌, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల‌ ఎమ్మెల్సీ ఎన్నికల‌ కోడ్‌ ఉన్నా ఇవేవి పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ బి. బి. పాటిల్‌, జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక ఎంపీటీసీల‌ను, జడ్పీటీసీ ల‌ను, కౌన్సిల‌ర్‌ల‌ను, భయ బ్రాంతుల‌కు గురి చేసి పార్టీ కండువాలు కప్పుతూ పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు.

ఈ మేరకు శనివారం జిల్లా శాసన మండలి ఉప ఎన్నికల‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల‌ కోడ్‌ను, ఎన్నికల‌ నియమ నిబంధనల‌ను పట్టించుకోకుండా ఉల్లంఘించారని ఆరోపించారు. కరోనా వైరస్ వ‌ల్ల‌ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిజామాబాద్‌ జిల్లా అధికార పార్టీ నాయకులు మాత్రం పార్టీ ఫిరాయింపుల‌ మీద దృష్టి పెట్టడం నీచమైన చర్యగా అభివర్ణించారు.

కాంగ్రెస్‌, ఇతర పార్టీలో గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కౌన్సిల‌ర్లను ఎన్నికల్లో ఓటు వేయకుండా అనర్హులుగా ప్రకటించాల‌ని కోరారు. అదే విధంగా ఎన్నికల‌ కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల‌ని కలెక్టర్‌కు విన్నవించారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ డిసిసి అధ్యక్షుడు మానాల‌ మోహన్‌ రెడ్డి, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌సి అభ్యర్థి సుభాష్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఇంచార్జ్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, జడ్పీటీసీ, నాగిరెడ్డిపేట్‌ మనోహర్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునీపూర్‌ రాజారెడ్డి పాల్గొన్నారు.

Check Also

సీజనల్‌ వ్యాదుల‌ నుంచి కాపాడుకుందాం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల‌ నుండి 10 నిమిషాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *