Breaking News

రైతుల‌కు ఉచితంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలి

డిచ్‌పల్లి, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాకు డౌన్‌ నేపథ్యంలో రైతుల‌ను వ్యవసాయ కూలీల‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల‌ని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వేల్పూర్‌ భూమన్న అన్నారు. ఈ మేరకు శనివారం అఖిల‌ భారత రైతు కూలీ సంఘం డిచ్‌పల్లి మండల‌ కమిటి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు మెమోరండం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రెండు నెలల‌ లాక్‌ డౌన్‌ సమయంలో అన్ని వర్గాల‌ ప్రజలు ఇంటికే పరిమితమైనా రైతులు, రైతుకూలీలు అన్ని రకాల‌ పంటలు పండిరచి ప్రజల‌కు తిండి గింజలు, దేశానికి ఆహారాన్ని, ఆదాయాన్ని అందించినా ప్రభుత్వం మాత్రం వారికి మొండి చేయి చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

20 ల‌క్షల‌ కోట్ల ఉద్దీపన పథకం ప్రకటించినప్పటికి రైతుల‌కు, రైతు కూలీల‌కు ఏమాత్రం సహాయం అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమాన్‌ నిధి 6 వేల‌కు బదులు 18 వేలు ఇవ్వాల‌ని, రైతుల‌కు అన్ని రకాల‌ అప్పుల‌ను మాఫీ చేయాల‌ని, రైతులు, వ్యవసాయ కూలిల‌ కుటుంబాల‌కు నెల‌కు 10 వేల‌ రూపాయలు ఇవ్వాల‌ని అన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతున్న సందర్భంగా రైతుల‌కు ఉచితంగా అన్ని రకాల‌ విత్తనాలు, ఎరువుల‌ను సరఫరా చేయాల‌ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని వెంటనే అమలు చేయాల‌ని, వల‌స కార్మికుల‌ను వారి వారి స్వస్థలాల‌కు పంపాల‌ని, ఖర్చులు ప్రభుత్వమే భరించాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో దేవసామి, సాయినాథ్‌, దాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *