Breaking News

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఎల్ల‌మ్మ గుట్ట వద్ద రూ. 20 కోట్లతో జరుగుతున్న రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ పనుల‌ను శనివారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలోని ఎల్ల‌మ్మగుట్ట రైల్వే కమాన్‌ వద్ద వర్షాకాలం వస్తే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడితే వాహనాల‌ని గంజ్‌, ల‌లిత మహల్‌ థియేటర్‌ నుండి పంపేవారని, ప్రస్తుతం అటువంటి సమస్య రాకుండా కమాన్‌ పక్కనే మరో వంతెన నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు.

31 మీటర్ల లెన్త్‌తో వంతెన నిర్మాణం జరుగుతుందని, ప్రస్తుతం 29 మీటర్లు లోపలికి వెళ్ళిందని, వచ్చే సోమవారం నాటికి మిగతా రెండు మీటర్ల పనులు పూర్తి చేసి రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మరి కొద్ది రోజుల్లో ఆర్మూర్‌ రోడ్‌కి నాలుగు లైన్‌ రహదారికి అనుసంధానం చేసి ప్రజల‌కి అందుబాటులోకి తీసుకరావడం జరుగుతుందన్నారు.

పనులు రైళ్లు నడుస్తున్న కూడా ఛాలెంజింగ్‌ డ్రీమ్‌ ప్రాజెక్టుగా చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఇ రషీద్‌, ఆర్‌అండ్‌బి డిఇ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *