Breaking News

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ముందు సంసిద్దత, కోవిడ్‌ -19 మహమ్మారిపై కార్యాచరణ ప్రణాళిక అనే అంశాల‌పై పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పంచాయతీ రాజ్‌ శాఖా ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా నిర్వహించిన విడియో కాన్ఫరెన్సులో జెడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు పాల్గొన్నారు.

వీరితోపాటు అడిషనల్‌ కలెక్టరు ల‌త, పీడీ. డీఆర్డీఓ. డిప్యుటీ. సీఈఓ, డీపీవో, డీ.ఎం హెచ్‌.ఓ. ఉన్నారు. చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో పల్లె ప్రగతి మొదటి, రెండవ విడత కార్యక్రమం బాగా జరిగిందని జిల్లా యంత్రాంగం చురుకుగా పనిచేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, కరోనా మహమ్మారిని అరికట్టడానికి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు బాగా కృషిచేశారని తెలిపారు.

అలాగే యన్‌.ఆర్‌.ఈ.జీ.యస్‌. పథకంలో మంజూరైన పనులు కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశానుసారం నిలుపుదల‌ చేయడమైందని, కాని చాలామట్టుకు మెటీరియల్‌ డంప్‌ చేయడం జరిగిందని తిరిగి పనులు ప్రారంభించేలా తగు అదేశాలు జారీ చేయించాల‌ని పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రిని కోరారు.

Check Also

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ...

Comment on the article