Breaking News

యువకుని రక్తదానం

కామారెడ్డి, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం కుర్తి గ్రామానికి చెందిన రేఖ అనే మహిళకు డెలివరి నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కాగా దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన వహీద్‌ అనే యువకుడు 5వ సారి రక్తదానం చేశాడని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వహీద్‌కు రక్తదాతల‌ సమూహం తరఫున అభినందనలు తెలిపారు.

యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాల‌ని, ప్రస్తుత తరుణంలో రక్త నిలువ‌లు తగ్గి పోయి బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో లేదని కావున యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో విటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌, సభ్యులు శివకృష్ణ, రహీమ్‌ ఉన్నారు.

Check Also

మొక్కజొన్నే గాంధారి ప్రాంత రైతుల‌ జీవనాధారం

గాంధారి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలుగా ఉండడం, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *