Breaking News

26న బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సమావేశం

బాన్సువాడ, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 26వ తేదీ మంగళవారం తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుల‌కు లాభసాటి వ్యవసాయ విధానం- అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్టు డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్‌.డి.ఓలు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు, డిఏఓ, డీసీఓలు, ఏడిఏలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రాథమిక వ్యవసాయసహకార సంఘాల‌ అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు, ఎంఆర్‌ఓలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏఓలు, ఏఈఓలు, మండల‌ రైతుబంధు అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామరైతుబంధు అధ్యక్షులు, మండల‌పార్టీ అధ్యక్షులు, గ్రామపార్టీ అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు, పిఏసిఎస్‌ సిఈఓలు తప్పక హాజరు కావాల‌ని సూచించారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల‌ వారు ఉదయం 10 గంటల‌కు బాన్సువాడలోని జిఆర్‌ఆర్‌ గార్డెన్సులో జరిగే సమావేశానికి హాజరు కావాల‌న్నారు. అలాగే నిజామాబాద్‌ జిల్లా కోటగిరి రుద్రూర్‌, వర్ని, చందూర్‌, మోస్రా మండలాల‌ వారు మధ్యాహ్నం 1.30 గంటల‌కు వర్నిలోని సిసిడి ఫంక్షన్‌ హాల్‌లో హజరు కావాల‌ని భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article