Breaking News

Daily Archives: May 26, 2020

నిజామాబాద్‌కు పొంచి ఉన్న ప్రమాదం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిడతల‌ దండు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల‌లో వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల‌ని నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖ పలు సూచనలు చేస్తుంది. వార్దా ప్రాంతంలో మిడతల‌ దండు ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందని తెలుస్తున్నందున రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. మిడతల‌ దండు పంటపై దాడిచేస్తే పంటకు తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల‌లో మిడతలు విజృంభిస్తూ ...

Read More »

మదన్‌మోహన్‌ రావుకు సన్మానం

నిజాంసాగర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ నివాసంలో రాష్ట్ర ఐటి సెల్‌ అధ్యక్షుడు, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ మదన్‌ మోహన్‌ రావుని రాష్ట్ర జడ్పీటీసీ ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్న గారి మనోహర్‌ రెడ్డి శాలువా, పూల‌మాల‌తో ఘనంగా సన్మానించారు. కాగా మదన్‌ మోహన్‌ రావు ఇటీవల‌ హూమన్‌ రైట్స్‌ ఇండియా సంస్థ అవార్డు పొందిన విషయం తెలిసిందే. మదన్‌ మోహన్‌రావును కలిసిన వారిలో పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

Read More »

గిట్టుబాటయ్యే పంటలు సాగు చేయడం రైతుకు వరం

నిజాంసాగర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ సూచించిన విధంగా నియంత్రిత సాగు విధానంలో మొక్కజొన్న వేయాల‌ని వ్యవసాయాధికారులు సూచించిన వంగడాల‌ను మాత్రమే సాగు చేస్తామని ర్యాకల్‌ రైతు స్థానిక శాసనసభ్యులు మాహారెడ్డి భూపాల్‌ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండలం పరిధిలోని ర్యాకల‌ గ్రామ ఉన్నత పాఠశాల‌ ఆవరణలో మండల‌ పరిషత్‌ అధ్యక్షురాలు చాందీ బాయి చౌహాన్‌ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల‌ ...

Read More »

600 మంది వల‌స కార్మికుల‌కు అన్నదానం

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 44, జంగంపల్లి కృష్ణ మందిరం వద్ద సుమారు 600 వందల మంది వల‌స కార్మికుల‌కు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వీరంతా తమిళనాడు నుండి నేపాల్‌ వెళుతున్నారు. అదేవిధంగా బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఛతీస్‌ ఘడ్‌, వాహనదారులు, లారీ డ్రైవర్లకు భోజనాల‌ను మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ...

Read More »

భాస్కర్‌రెడ్డి యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

బాన్సువాడ, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బాన్సువాడ పట్టణంలో పోచారం భాస్కర్‌ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి సూచన మేరకు ఉచితంగా మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను ప్రజల‌కు పంపిణీ చేశారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ రోజు వారీ పనుల‌ కోసం పట్టణానికి వచ్చే వారికి ఎండ వ‌ల్ల‌ వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజల‌ దాహార్తి తీర్చేందుకు ...

Read More »

కార్మికుల‌ కోసం శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేక సమాచార విభాగం

హైదరాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ దేశాల‌ నుంచి వచ్చే కార్మికుల‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమాచార విభాగం ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల‌ నుంచి వచ్చే వారు నేరుగా సమాచార విభాగం దగ్గరకు వెళ్తే వారు కోరుకున్న మేరకు క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వారం రోజుల‌కు భోజనం, వసతికి కలిపి ప్రీమియం కేటగిరికి 16 వేలు, స్టాండర్డ్‌ కేటగిరికి 8 వేలు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నిరుపేద గల్ఫ్‌ కార్మికులు డబ్బు ...

Read More »

సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని నగర ప్రజల‌కు నగర మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అవగాహన కల్పించారు. మంగళవారం నగరంలోని 34వ డివిజన్‌ మిర్చి కంపౌండ్‌ ఏరియాలో ఇంటింటికి వెళుతూ ప్రజల‌కు సీజనల్‌ వ్యాధుల‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల‌ పరిశుభ్రత విషయంలో బాధ్యత తీసుకోవాల‌ని, తడి పొడి చెత్త వేరు చేయాల‌ని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువుల‌లో నీరు నిలువ‌ ...

Read More »