Breaking News
మజ్జిగ పంపిణీ చేస్తున్న యువ‌సేన కార్య‌క‌ర్త‌లు

భాస్కర్‌రెడ్డి యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

బాన్సువాడ, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బాన్సువాడ పట్టణంలో పోచారం భాస్కర్‌ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి సూచన మేరకు ఉచితంగా మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను ప్రజల‌కు పంపిణీ చేశారు.

గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ రోజు వారీ పనుల‌ కోసం పట్టణానికి వచ్చే వారికి ఎండ వ‌ల్ల‌ వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజల‌ దాహార్తి తీర్చేందుకు 5 వేల‌ మజ్జిగ మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండాకాలం ఉన్నంత వరకు ప్రజల‌కు ఉచిత మజ్జిగ మంచినీటిని పోచారం భాస్కర్‌ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో అందిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమములో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, పట్టణ తెరాస పార్టీ అధ్యక్షుడు పాత బాల‌కృష్ణ, స్థానిక ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, బుడ్మీ ప్యాక్స్‌ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు, మండల‌ నాయకులు ఎజాజ్‌, గురు వినయ్‌, నార్ల సురేష్‌, అలిముద్దీన్‌ బాబా, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article